తహాశీల్ధార్ హామీ పత్రం ఇవ్వడం తో దీక్ష విరమణ చేసిన ముల్లా ఖాదర్ భాష

పొదిలి మండల రెవిన్యూ తహాశీల్ధార్ కార్యలయం వద్ద గత రెండురోజుల నుండి నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న పొదిలి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాష కు పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ సిహెచ్ విద్యాసాగరడు హామీ పత్రం అందజేసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. ఈ సందర్భంగా తహాశీల్ధార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ పొదిలి రెవిన్యూ గ్రామ సర్వే నెంబర్ 1115,1172 నందు సర్వే నేడు పూర్తి చేసామని ఆక్రమణ లను గుర్తించామని అందరికీ నోటీసులు జారీ చేసి చర్యలు చేప్పట్టుతమని తెలిపారు.దీక్ష విరమణ చేసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాష మాట్లాడుతూ తహాశీల్ధార్ గారు సకాలంలో స్వందించి చర్యలు పరబించాటం మరియు లిఖితపుర్వంగా హామీ ఇవ్వడం తో దీక్ష విరమణ చేసానని అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి రెవెన్యూ సిబ్బంది జానీ బేగ్ సుబ్బారావు మురళి బ్రహ్మయ్య అంజి పట్టణ నాయకులు షేక్ నజీర్ షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు