ముద్ర రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన సానికొమ్ము
ముద్ర రుణ మంజూరు పత్రాలను మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి పంపిణీ చేశారు. బుధవారం స్ధానిక విశ్వనాధపురంలోని ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్ మెంట్ మల్టి స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు ముద్ర రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పొదిలి జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు హాజరై చెక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల ఎంపీటీసీలు, మాజీ వార్డ్ మెంబర్లు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.