ప్రశాంతంగా ముగిసిన మొహర్రం వేడుకలు
పొదిలి పట్టణం నందు మొహర్రం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక తూర్పుపాలెం , ప్రభుత్వం వైద్యశాల వద్ద ఉన్న పీర్ల చావడి నుంచి పీర్లు ఊరేగింపు గా బయలుదేరి అమ్మవారి శాల సమీపంలో పీర్లు ఆలింగనం చేసుకొనే సందర్భంగా పెద్ద ఎత్తున తమలపాకులను విసిరి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా యువత చేసిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పొదిలి సిఐ సుధాకర్ రావు యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త గా బందోబస్తును ఏర్పాటు చేశారు.