ఘనంగా ములాయం జన్మదిన వేడుకలు
సమాజ్ వాది పార్టీ వ్యవస్ధపాక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే స్ధానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ములాయం జన్మదిన వేడుకల సభకు ముఖ్యఅతిధిగా హాజరైన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కఠారి రాజు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల కుటుంబంలో జన్మించి మూడు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా, సీనియర్ పార్లమెంటు సభ్యులుగా ఓటమి ఎరగని నాయకుడిగా ఉన్న ములాయంను ప్రస్తుతం సంకీర్ణ రాజకీయాల నేపద్యంలో 2019 ఎన్నికలలలో ప్రధానిగా చేసుకునే అవకాశం ఉందని…..ఆ దిశగా మనం పయనించాలని ఆకాంక్షించారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో తొలుత స్ధానిక శివాలయంలో ములాయం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు, యాదవ్ మందగిరి వెంకటేష్ యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్, బాలగాని నాగరాజు, పెమ్మని రాజు, నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్, సన్నెబోయిన రాంబాబు, బోగాని సుబ్బారావు, పొల్లా నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.