నాలుగో రోజుకు చేరిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల‌ ధర్నా

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పారిశుద్ధ్య కార్మికులు 9 ప్రధాన డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది.

గురువారం నాడు నాలుగోరోజు సమ్మె లో భాగం స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మానవహారం మరియు ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు