మూసీనదిని సాగర్ జలాలతో నింపాలి : సిపియం
కాశీపురం వద్ద గల ముసిలోకి యర్రఓబనల్లి మేజర్ బ్రాంచికాలువ నుండి మద్దెపువాగు ద్వారా సాగర్ నీటిని వదిలి తక్షణం కరువు ఉపశమనచర్యలు చేపట్టాలని సిపియం పొదిలి ప్రాంతీయ కార్యదర్శి యం.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పొదిలి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన కరువు వెన్నాడుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా ముసి ఒడ్డున గలా గ్రామాలలో కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సివస్తుందన్నారు.త్రాగు వాడుకనీటికి ట్యాంకర్స్ పై ఆదారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, త్రాగడానికి పొలాల్లో ఎక్కడా కూడా నీటిచుక్క లేదన్నారు. వేసిన కంది, సజ్జ, మిరప పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఈనేపధ్యంలో తక్షణమే త్రాగు మరియు వాడుకనీటి సమస్య పరిష్కారానికి యర్రఓబనపల్లి మేజర్ బ్రాంచికాలువ నుండి మద్దెపువాగు ద్వారా ముసికి సాగర్ నీటిని విడుదలచేయడం ద్వారా మండలంలోని 15 గ్రామాలలో నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. పశువులు గొర్రెలు, మేకలు నీటి పశుగ్రాసం సమస్య తీరడమే కాకుండా ఎండిపోతున్న పంటలను కాపాడుకోవచ్చన్నారు. ముసికి సాగర్ నీటిని వదలకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి రైతులు సిద్దం కావాలని సూచించారు.