నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులలో భూముల కోల్పోయిన రైతులతో కందుకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కె ఎస్ రామారావు సమావేశం ఏర్పాటు చేసి అవార్డు అలాగే విచారణ నోటీసులు గురువారంనాడు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే రైతులతో మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి రైతులతో సమావేశమై భూకొలతలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇతరులు ఎవరైనా కౌలుకు కానీ తాకట్టుకు సంబంధించిన వివరాలు ఉంటే వాంగ్మూలము ద్వారా తెలిజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.