వెలుగు కార్యాలయాన్ని ముట్టడించిన నాగలక్ష్మి బంధువులు
వెలుగు కార్యాలయాన్ని నాగలక్ష్మి బంధువులు ముట్టడించిన సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే వెలుగు అధికారుల వేధింపులకు కొండాయిపాలెం గ్రామ వెలుగు ఈఓ గా పనిచేస్తున్న జనమల నాగలక్ష్మి మంగళవారం నాడు ఆత్మహత్య పాల్పడిన సంఘటన పై వెలుగు అధికారుల వేధింపుల వలన నాగలక్ష్మి ఆత్మహత్య కు పాల్పడి మృతి చెందిందని ఆరోపిస్తు నాగలక్ష్మి బంధువులు కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా మృతురాలు నాగలక్ష్మి కుమార్తెలు మాట్లాడుతూ తమ తల్లి ఆత్మహత్య కు కారణమైన వెలుగు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న నాగలక్ష్మి బంధువులకు నచ్ఛా చెప్పి ఆందోళన విరమింప చేశారు