సోషల్ మీడియా లో హెచ్చరికల నేపథ్యంలో దిగివచ్చిన నగర పంచాయితీ

పొదిలి పట్టణంలోని స్థానిక హరికృష్ణ థియేటర్ సమీపంలో ఉన్న హిందూ స్మశానం నందు పట్టణంలోని చెత్త తీసుకొని వచ్చి వెయ్యడం పై సోషల్ మీడియా వేదికగా హిందువు యువత హెచ్చరిక నేపథ్యంలో నగర పంచాయితీ అధికారులు దిగి వచ్చిన సంఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది.

గత కొంతకాలంగా పట్టణంలో చెత్త తీసుకొని వచ్చి హిందూ స్మశానం వెయ్యటం పై మూడు నెలల క్రితం పొదిలి టైమ్స్ ప్రత్యేక కధనం తో నగర పంచాయితీ అధికారులు స్పందించి వెంటనే స్మశానం లో ఉన్న చెత్తను తరలించడం జరిగింది.

కొంతకాలం మౌనంగా ఉన్న నగర పంచాయితీ అధికారులు ఇటివల మరలా హిందూ స్మశానం నందు చెత్త వెయ్యటంతో “పొదిలి ప్రెస్ క్లబ్” వాట్సాప్ గ్రూప్ నందు మంగళవారం నాడు తీవ్ర చర్చనీయాంశమైంది 24 గంటల్లో చెత్తను తొలగించకపోతే నగర పంచాయితీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చెయ్యటంతో దిగి వచ్చిన నగర పంచాయితీ అధికారులు రేపు పూర్తిగా చెత్తను తరలించడం జరుగుతుందని మరలా ఎప్పుడు హిందూ స్మశానం నందు చెత్త వెయ్యమని ఒక పోస్ట్ ద్వారా తెలపటం హిందూ యువత శాంతించింది.

బుధవారం నాడు చెత్తను తొలగించకపోతే గురువారం నాడు నగర పంచాయితీ కార్యాలయం నందు ఆందోళన నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు హిందూ కుల సంఘాల నాయకులు ప్రకటించారు