జనసేనాని పవన్ కళ్యాణ్ తో నాగరాజు భేటీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ న్యాయ విభాగం సంయుక్త కార్యదర్శి వరికుటి నాగరాజు కలిసారు.
వివరాల్లోకి వెళితే మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నందు జరిగిన జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నాగరాజు అనంతరం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యా దరిశి నియోజకవర్గం లో పార్టీ పరిస్థితిని వివరించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారని వరికుటి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు