మరో నకిలీ నక్సలైట్ అరెస్టు

పొదిలి పట్టణంలో గత నెల17 వ తేదీన ఇటుక బట్టీ యజమాని నరసింహారావు ను నక్సలైట్లు అని నకిలీ తుపాకి మరియు కత్తులతో బెదిరించిన కేసులో మొత్తం ఐదుగురు గాను నాలుగురుని అప్పుడు అరెస్టు చేయగా నేడు ఉదయం పొదిలి మార్కపురం క్రాస్ రోడ్ వద్ద బుధవారం ఉదయం మిగిలిన ఒక్కడైన ఆకుల రవి ని అరెస్టు చేసినట్లు పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు పొదిలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ నాగరాజు పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు