జర్నలిస్టులకు స్వంత ఖర్చులతో భీమా చేయించిన నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జర్నలిస్టులకు తన స్వంత ఖర్చులతో జీవిత భీమా చేయించారు.
వివరాల్లోకి వెళితే కరోనా కోరలు చాస్తున్న వేళ వార్తా సమాచారం ప్రజలకు అందించడంలో కీలకపాత్ర వహిస్తున్న జర్నలిస్టులకు జీవితభీమా లేకపోవడంతో ఇటీవల ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడి మృతిచెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు…… జర్నలిస్టులకు జీవితభీమా చేయించడం ద్వారా వారి కుటుంబాలకు ఆసరాగా నిలబడేందుకు వీలుగా ఉండవచ్చుననే భావనతో ఆయన పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలలో పని చేస్తున్న జర్నలిస్టులకు జీవితభీమా చేయించి ఆ మొత్తాన్ని ఆయనే స్వయంగా చెల్లించినట్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది.
కోవిడ్ విజృంభిస్తున్న వేళ వైద్య, పారిశుద్ధ్య, అత్యవసర మరియు పోలీసులతో పాటుగా ఎటువంటి భీమా సదుపాయం లేనటువంటి ముందువరుసలో ఉన్న యోధులు జర్నలిస్టులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులకు తనవంతుగా మంగళగిరి నియోజకవర్గ జర్నలిస్టులకు భీమా చేయించడం జరిగిందని తెలిపారు.
ఈ భీమా ద్వారా సాధారణ మరణం (కోవిడ్ మరణం అయినా) అయితే 10లక్షలు, ఏదైనా ప్రమాదంలో చనిపోతే 20లక్షలు భీమా పాలసీ వారి భీమా పత్రంపై ఉన్న నామినీకి అందజేయడం జరుగుతుందని….. త్వరలోనే భీమాకు సంబంధించిన ఫారాలను అందజేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో జర్నలిస్టులందరికి ప్రభుత్వం భీమా చేయించాలని….. కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన జర్నలిస్టులకు 50లక్షలు ఇవ్వాలని….. ప్రతి జర్నలిస్టుకు పిపిఈ కిట్లను అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.