ముదిరాజ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడుగా నరసింహారావు
ప్రకాశం జిల్లా ముదిరాజ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పొదిలి పట్టణం చెందిన బుడంగుంట్ల వెంకట నరసింహారావు ను నియమిస్తూ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి కృష్ణ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా పలువురు నరసింహారావు ను అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ జిల్లాలో ముదిరాజ్ విద్యార్థి సంఘాన్ని పటిష్టం పరిచి విద్యార్థుల సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తానని అన్నారు.