జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారంనాడు పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరగబోయే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని….. లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీపడడం వలన సమయం మరియు డబ్బు ఆదా అవుతాయని…. చిన్న చిన్న విభేదాలవలన సంబంధాలు విచ్ఛిన్నం అవుతాయని వాటిని రాజీ చేసుకోవడం వలన సంబంధాలు బలపడడమే కాకుండా స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం వలన శాంతియుత వాతావరణం ఉంటుందని….. రేపు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీపడే విధంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహాయ సహకారాలు అందించాలని, పోలీసులు ఎక్కువగా కృషి చేయాలని పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది.