నేటి నుండి ప్రారంభమైన కౌలు రైతుల గ్రామ సభలు

నేటి నుండి కౌలు రైతుల గ్రామ సభలు మండల రెవిన్యూ తహశీల్దార్ జె ప్రభాకరరావు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలంలోని భూ యజమానులు మరియు కౌలుకు భూమి తీసుకున్న రైతులతో మండల రెవిన్యూ తహశీల్దార్ అధ్యక్షతన మొదటిరోజు గ్రామసభ యేలూరు గ్రామం సచివాలయంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాసులురెడ్డి , లీడ్ బ్యాంకు అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారి మురళి రెవిన్యూ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది తదితరులు హాజరయ్యారు.