చెత్త సంపద కేంద్రాన్ని ప్రారంభించిన అదిరింది ఫేమ్ నెమలిరాజు
చెత్త సంపద కేంద్రాన్ని జబర్దస్త్ మాజీ కమిడియన్ ప్రస్తుత అదిరింది ఫేమ్ నెమలిరాజు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం గుండ్లసముద్రం గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త సంపద కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదిరింది ఫేమ్ నెమలిరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చునని….. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తకుండీలలో వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ఎన్ యఎస్ రాంబాబు , డిప్యూటీ తహశీల్దార్ రవి, వ్యవసాయ అధికారి తిరుమలరావు, ఈఓఆర్డీ పెట్టెల శంకర్ మరియు అధికారులు, వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, బి రమణారెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.