పంచాయతీ కార్యదర్శిగా బ్రహ్మనాయుడు బాధ్యతల స్వీకరణ

పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బ్రహ్మ నాయుడు భాద్యతలు స్వీకరించారు.

వివరాల్లోకి వెళితే సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అయనను పొదిలి పంచాయతీ కార్యదర్శిగా నియమిస్తూ మంగళవారంనాడు జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేయగా…… బుధవారంనాడు స్ధానిక మండలం పరిషత్ కార్యాలయంలో చేరిక నివేదికను అందించి పంచాయతీ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కారం దిశగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ సందర్భంగా పంచాయతీ శానిటరి ఇన్స్పెక్టర్ మారుతిరావు మరియు పంచాయతీ సిబ్బంది నూతన కార్యదర్శికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు