నూతన డిఎం కు ఘన స్వాగతం

ఏపీఎస్ ఆర్టీసీ పొదిలి డిపో నూతన డిపో మేనేజర్ కు డిపో ఎంప్లాయిస్ యూనియన్ మరియు డిపో మరియు గ్యారేజ్ కమిటీల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వివరాల్లోకి వెళితే పొదిలి డిపో మేనేజర్ గా పనిచేసిన మురళీమోహన్ ను ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయగా ఆ స్థానంలో నూతనంగా డిఎం గా పదోన్నతి పొంది మొదటిగా మేనేజర్ బాధ్యతలు స్వీకరిస్తున్న సిహెచ్.సి.ఎస్. బెనర్జీ కి డిపో యూనియన్ నాయకులు, గ్యారేజ్, డిపో సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ పొదిలి డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి డిఎం మురళీమోహన్ కార్మికులతో మమేకమై ఒకే కుటుంబంలా పని చేశామని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, గుర్తింపు పొందిన సంఘం ఎంప్లాయిస్ యూనియన్ కు పూర్తి సహాయ సహకారాలు అందించి డిపో అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. అదే విధంగా నూతన డిఎం కూడా కార్మికులతో యూనియన్ మరియు గుర్తింపు సంఘాలుగా సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తామని అలాగే ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని అధ్యక్ష, కార్యదర్శిలు బి.రామకృష్ణ, కెవి.రావు అన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న మురళీమోహన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లు, గ్యారేజ్ అధ్యక్ష, కార్యదర్శిలు డి సిహెచ్ అంజయ్య, సీసీఎస్ డెలిగేట్, బి రోషన్ కుమార్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.