కోరికల సాధనకై తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల కోరికల సాధనకై తహశీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారంనాడు ధర్నా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట
జరిగిన ధర్నా కార్యక్రమం సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ
2018నుండి 2019వరకు రావలసిన 3విడతల వృత్తి భత్య బకాయిలు….. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయుట….. మహిళా ఉద్యోగిణిలకు 5ప్రత్యేక సెలవులు మంజూరు చేయుట…. ఆరోగ్య పుస్తకాలు సక్రమముగా అమలు అయ్యేటట్లుగా చర్యలు తీసుకొనుటక మొదలగు కోరికలు ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐక్య కార్యచరణ నాయకులు నారు శ్రీనివాసులు రెడ్డి, ఎస్ ఎం రఫీ, పి రమణారెడ్డి, బాదుల్లా, కిలారి సుబ్బారావు, రమాకుమారి, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, షేక్ అబ్దుల్, షేక్ నాగూర్ వలి, మహిళా ఉద్యోగులు శైలజ, విజయలక్ష్మి, పద్మ మరియు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.