మేనల్లుడిపై మామ దాడి…. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

మేనల్లుడుపై మామ బరిసతో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన మేనల్లుడుని బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందిన సంఘటన మర్రిపూడి మండలం నిమ్మాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం నిమ్మాపురం గ్రామంలో మేనల్లుడైన పోకల రాజశేఖరరెడ్డికి మేనమామ అయిన ముత్తముల కాశిరెడ్డికి మద్య అస్థికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని ఇదే క్రమంలో శుక్రవారంనాడు కూడా ఇద్దరి మద్య గొడవ జరిగిందని బంధువులు సర్ధిచెప్పడంతో గొడవ సర్దుమనిగిందని బంధువులు తెలిపారు. శనివారం ఉదయం ఆరుబయట మంచంపై మేనల్లుడు పోకల రాజశేఖరరెడ్డి కూర్చుని ఉండగా ముత్తముల కాశిరెడ్డి తనతో తెచ్చుకున్న బరిసతో ఒక్కసారిగా మెరుపుదాడి చేయడంతో తప్పించుకోవడానికి వీలులేకపోయిందని దాడి చేసిన వెంటనే కాశిరెడ్డి అక్కడి నుండి వెళ్ళిపోయాడని బంధువులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖరరెడ్డిని బంధువులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాజశేఖర రెడ్డిని పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు,యస్ఐ శ్రీరామ్, ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.