నామినేట్ పదవులు నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్
నామినేట్ పదవులు నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్
నామినేట్ పదవులు నిర్మాతలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే స్థానిక యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పదవుల్లో బిసి, యస్సీ ,యస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నియమించిన టిటిడి పాలక వర్గం, వివిధ రకాల కార్పోరేషన్ పదవులు, సలహాదారు పదవులు మరియు వివిధ రకాల పదవులలో నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యాదవ కార్పోరేషన్ పాలకవర్గం ఏర్పాటు చేసి 2వేల కోట్ల నిధులు కేటాయించాలని….. అదే విధంగా ఇటివలే త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై శాసనసభలో తీర్మానం చేసిన దిశాచట్టం అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
అలాగే జిల్లాలో యాదవులకు ఇస్తానని హామీ ఇచ్చిన శాసనమండలి పదవిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, స్థానిక యాదవ మహాసభ నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, సన్నెబోయిన రాంబాబు, చాగంటి వెంకటేశ్వర్లు, బండారు శివ కుమార్ యాదవ్, కార్తీక్, మందగిరి రమేష్ యాదవ్, బోగాని సుబ్బారావు, రెడ్డిబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.