నోట్ బుక్స్ పంపిణీ చేసిన పూర్వ విద్యార్థి
మాదాలవారిపాలెం గ్రామం రామాయణ కండ్రిక ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు కలాలను పాఠశాల పూర్వ విద్యార్ధి…. ఒంగోలులోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కామునూరి వెంకటరావు విద్యార్ధులందరికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని గతంలో కుర్చీలు మరియు బెంచీలు పంపిణీ చేశానని….. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలకు ఎలాంటి వసతులు కావాలన్న తనవంతు సహాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వైకె మోహన్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి యు శేషగిరి, పాఠశాల ఉపాధ్యాయులు ఉమా మాహేశ్వరి, వి.సాల్మాన్, ఎమ్ పద్మజ మరియు విద్యార్ధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.