ఇంటి నిర్మాణం చేసుకోని వారికి నోటీసులు: డిఇ పవన్ కుమార్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఇంటి నిర్మాణం చేసుకొని వారికి నోటీసులు జారీ చేస్తామని గృహ నిర్మాణ శాఖ డిఇ పవన్ కుమార్ తెలిపారు.
సోమవారం నాడు స్థానిక గృహ నిర్మాణ శాఖ కార్యాలయం నందు తనను కలిసిన విలేఖరులతో డిఇ పవన్ కుమార్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం లో 2580 గృహాలు మంజూరు కాగా 2093 గృహాలు లేఔట్ లో ఇవ్వగా సొంత స్ధలాలు ఉన్నవారికి 487 గృహాలు మంజూరు చేస్తామని పొదిలి లేఔట్ లో 158 గృహాలకు పనులు ప్రారంభం కాగా 108 గృహాలు బెస్మెంట్ వరకు పనులు పూర్తి చేసారని గృహాలు మంజూరు అయినా వారు వెంటనే గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలని అలాగా ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ ఇంజనీర్ కె వి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు