మూడో విడత గ్రామ వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్ జారీ

పొదిలి మండలంలోని వివిధ గ్రామ సచివాలయాల పరిధిలోని…. గ్రామ పంచాయతీల వారీగా రాజీనామా మరియు ‌గైర్జాజరవుతున్న ‌గ్రామ‌ వాలంటీర్ల స్ధానంలో మూడో విడత గ్రామ వాలంటీర్ల ఎంపికకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పొదిలి మండలంలోని అక్కచెరువు-01, ఆముదాలపల్లి-01, ఈగలపాడు-03, కంభాలపాడు-01, కొండాయపాలెం-01, పాములపాడు-01, పొదిలి-09, సుదనగుంట-01, తళమళ్ళ-01, ఉప్పలపాడు-01, యేలూరు-01 మొత్తం 11పంచాయతీల పరిధిలో 22వాలంటీర్ల ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేశారు.

దరఖాస్తుదారులు తేది 01.01.2020 నాటికి 18సంవత్సరాల నిండి 35సంవత్సరాలలోపు వారు అర్హులు…. అర్హులైన వారు దరఖాస్తును తేది 24.04.2020లోగా  gswsvolunteer.apcfss.in ఆన్లైన్ చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ప్రకటన విడుదల చేశారు.