25న పొదిలిలో జిల్లాస్ధాయి యాదవ వన సమారాధన
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జిల్లాస్ధాయి కార్తీక వన సమారాధన కార్యక్రమం ఈ నెల 25వ తేది ఆదివారం పొదిలిలో నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శిలు మూరబోయిన బాబూరావు యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్, మండల అధ్యక్షులు శిరిమల్లె శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి పెమ్మని రాజు లు గురువారంనాడు యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా స్ధాయి యాదవ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతస్థాయి అధికారులు, తదితరులు హాజరువుతారని కావున జిల్లాలోని యాదవులు వేలాది తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.