ఫ్లోరోసిస్ నివారణ మరియు నియంత్రణ కోసం ట్రై సైకిళ్లు పంపిణీ
జాతీయ ఫ్లోరోసిస్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పొదిలి నగర పంచాయితీ పరిధిలోని మూడో వార్డు రాజుపాలెం గ్రామ నందు శనివారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో. రెడ్ క్రాస్, రోటరీ క్లబ్ సౌజన్యంతో గ్రామానికి చెందిన పలువురికి వీల్ చైర్లు, వాకర్ స్టిక్ లు లను పంపిణీ చేశారు.
ఉప్పలపాడు ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుష్మా అద్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఫ్లోరోసిస్ నివారణ మరియు నియంత్రణ అధికారి అనీల్ కుమార్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ నివారణకు కోసం గత సంవత్సరం లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన నివేదిక ప్రకారం గ్రామంలో 20 మందిని గుర్తించి వారికి అవసరమైన పరికరాలను రెడ్ క్రాస్, రోటరీ క్లబ్ వారి సౌజన్యం మరియు కేంద్ర ప్రభుత్వం నిధులతో పంపిణీ చేసామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు