పౌరసత్వ సవరణ, జాతీయ పౌర పుస్తకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు భారీ రహదారి ప్రదర్శన
పౌరసత్వ సవరణ మరియు జాతీయ పౌర పుస్తకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు, ముస్లింలు భారీ రహదారి ప్రదర్శన నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే గురువారం వామపక్షాలు మరియు జమియత్ ఉలేమా ఇ హింద్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథపురం సెంటర్ నుండి పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్ మీదుగా తహశీల్దారు కార్యాలయం వరకు భారీ రహదారి ప్రదర్శన నిర్వహించి….. అనంతరం తహశీల్దారు ప్రభాకరరావును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం వలన మరియు జాతీయ పౌర పుస్తకం వలన ముస్లింలు హక్కులను కాలరాస్తున్నారని కాబట్టి తక్షణమే వాటిని అమలును నిలిపివేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం రమేష్, సిపిఐ మండల కార్యదర్శి ఏసురత్నం, పట్టణం కార్యదర్శి కె వి రత్నం, మౌలానా రబ్బానీ సాబ్, మౌలానా ఇస్మాయిల్ సాబ్, మౌలానా రఫీ సాబ్, మతపెద్దలు మరియు ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.