ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
పొదిలిలో ఎన్టీఆర్ 23వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గునుపూడి భాస్కర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనప్పటికి తెలుగు ప్రజలు గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయే నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు, జిలాని, రసూల్, గౌస్, భూమా సుబ్బయ్య, మేడా ప్రతాప్, అల్లా, తెదేపా కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.