యాదవుల మద్దతు లేనిదే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు : నూకసాని

జిల్లాలో మూడు సీట్లు కేటాయించాలి

 

దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే యాదవుల మద్దతు తప్పనిసరి అని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ అన్నారు. స్ధానిక ఎస్వికేపి డిగ్రీ కళాశాలలో చల్లా లక్ష్మి నారాయణ అధ్యక్షతన జరిగిన యాదవ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన బాలాజీ మాట్లాడుతూ రాజకీయ పక్షాలు యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో నిర్లక్ష్యం చూపిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని అదేవిధంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడినుండైనా పోటీకి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాజ్యాధికారంలో మన వాటా కోసం మన సత్తా నిరుపించే సమయం అసన్నమైందని జనవరిలో పది లక్షల మందితో యాదవుల మేళా నిర్వహించి మన సత్తా తెలుపుదామని అదేవిధంగా త్వరలో రథయాత్ర నిర్వహించి యాదవులను జాగృతం చేస్తామని యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరి జనరల్ యార్రాకుల తులసీరామ్ యాదవ్ అన్నారు. జిల్లా గ్రాంథలయ సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో యాదవులకు మూడు సీట్లు కేటాయించాలని అన్నారు. రాష్ట్ర కోశాధికారి ఆలా బాలయ్య మాట్లాడుతూ యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చెయాలని అన్నారు. జిల్లా గ్రాంధలయం సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు మరియు యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు ఆలా బాలయ్యలను ఘనంగా సత్కరించారు. తొలుత శ్రీకృష్ణ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వన సమారాధన కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీగా వేలాది యాదవుల తరలివచ్చి జయప్రదం చేసినందుకు ఆహ్వాన కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోకార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రాంథలయం సంస్థ చైర్మన్ వై వి సుబ్బారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాకర్ల శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.