పొదిలి టైమ్స్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన నూకసాని బాలాజీ

2022 ఆంగ్ల సంవత్సరది పొదిలి టైమ్స్ క్యాలెండర్ ను ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నాడు స్థానిక దరిశి రోడ్డు లోని మంజునాథ కళ్యాణ మండపం నందు పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మరియు తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ హాజరైయ్యారు.

తొలుత నూకసాని బాలాజీని ఘనంగా సత్కరించారు

అనంతరం 2022 ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కోసి పంచిపెట్టారు.

తదుపరి పొదిలి టైమ్స్ 2022 ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మీడియా ఎప్పుడు ప్రజాపక్షం ఉండాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వారధిగా పని చేయాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే జర్నలిజం వ్యవస్థ లేకపోతే నియంతృత్వ పోకడలకు దారితీస్తుందని కాబట్టీ జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి ప్రజా సమస్యలను అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం దిశగా పనిచేయాలని ఆయన అన్నారు.

పొదిలి టైమ్స్ గత ఐదు సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా మరియు అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజా క్షేత్రంలో పెట్టి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తుందని నూకసాని బాలాజీ అన్నారు.

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు

ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ సబ్ ఎడిటర్లు షేక్ మస్తాన్ వలి, చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్,వెబ్ డెవలపర్ కోగర నరసింహా యాదవ్, పాత్రికేయులు జెకె విశ్వనాథ్, గిద్దలూరు ప్రశాంత్, రాధాకృష్ణ,దరిశి శివాజీ, పట్నం శ్రీనివాస్, పరమేశ్వరరావు ,సుబ్బారావు పందిటి సునీల్ , కిషోర్, మాచర్ల,మచ్చా రమణయ్య, మహేంద్ర, నారబోయిన సురేష్ యాదవ్, ఆదిలక్ష్మి ,తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్ ,పొల్లా నరసింహా యాదవ్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, శామంతపూడి నాగేశ్వరరావు, మూరబోయిన బాబురావు యాదవ్, మువ్వ కాటంరాజు యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్ కనకం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు..