పెద్ద బాబు ను పరామర్శించిన నూకసాని

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు ను తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ పరామర్శించారు.

గత రెండు రోజులు క్రితం వాకింగ్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు జారి పడటం చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి సదరు విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ పెద్ద బాబు నివాస గృహానికి వెళ్లి పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి యస్ ఎం భాషా, తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,కార్యనిర్వహక కార్యదర్శి పోల్లా నరసింహా యాదవ్, తెలుగు దేశం పార్టీ మైనారిటీ సెల్ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్, తెలుగు దేశం పార్టీ శాలివాహన సాధికారత కమిటీ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు పట్నం శ్రీనివాస్, తెలుగు దేశం పార్టీ బిసి సెల్ పార్లమెంట్ కమిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం వెంకట్రావు యాదవ్, కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ మాజీ సర్పంచ్ దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకులు షేక్ యాసిన్, ముల్లా జిలానీ షేక్ అమ్మని షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు