ఓబులరెడ్డికి ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్ళు
పొదిలి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ మీగడ ఓబులరెడ్డి మూడవ వర్థంతి సందర్భంగా స్థానిక మాదాలవారిపాలెం నందు మాజీ ఎంపిటిసి సయ్యద్ ఇమాంసా ఆధ్వర్యంలో ఓబులరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండలం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, ముల్లా ఖుద్దూస్, షేక్ యాసిన్, మస్తాన్ వలి, సంధాని తదితరులు పాల్గొన్నారు.