కోవిడ్ నియంత్రణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జిల్లాలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక పొదిలి సాయి బాలాజీ కళ్యాణ మండపంలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, నియోజకవర్గాల అధికారులతో కోవిడ్-19, నివారణ, నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ నివారణ, నియంత్రణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.
జిల్లాలో 3నెలల పాటు కరోనా వైరస్ నియంత్రణపై అనేక రకాలుగా చైతన్యం తెచ్చినప్పటికీ ప్రజల నుండి ఆశించిన ఫలితాలు రాలేదన్నారు……. అధికారులు నిరుత్సాహ పడకుండా ప్రజలకు క్షేత్రస్థాయి నుండి అవగాహన కల్పించాలని…… జిల్లాలో క్షేత్రస్థాయిలో కంటైన్మెంట్ యాక్షన్ ప్లానును పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు.
జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చిన వెంటనే ప్రైమరీ మరియు సెకండరీ కంటాక్టులు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని…… కోవిడ్ మరణాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
కోవిడ్ వైద్య పరీక్షల కోసం సేకరించిన శాంపిల్ స్వాబ్ లకు గుర్తింపు స్టికర్ లను అంటించాలని…… శాంపిల్స్ పరీక్షలకు పంపే ముందు జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేసిన నిర్లక్ష్యం వలన ల్యాబ్ సిబ్బంది మరణించారని అన్నారు. కోవిడ్ టెస్టింగ్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించకుండా శాంపిల్స్ పక్కన పెట్టినట్లు గుర్తించడం కూడా జరిగిందన్నారు.
వైద్య పరీక్షలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని….. కోవిడ్ వైద్య పరీక్షలు 50 సంవత్సరాలు పైబడిన వారికి ముందుగా చేయాలని….. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి కరోనా వైరస్ నియంత్రణ చేశామన్నారు.
ఢిల్లీకి మత పార్ధనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి కట్టడి చేయడానికి చర్యలు తీసుకున్నామన్నామని…. లాక్ డౌన్ అనంతరం కేసులు వేగంగా వ్యాప్తి చెందాయని….. ఎక్కువశాతం దుకాణాలు మరియు ఎస్టాబ్లిష్మెంట్ వద్ద కోవిడ్ కేసులు నమోదయ్యాయని…… జిల్లాలో క్షేత్ర స్థాయిలో కంటైన్మెంట్ ప్రణాళికను అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు….. మండల స్థాయిలో తసీల్దార్లు, ఎంపీడీఓ లు,స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ సమిష్టిగా పనిచేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ చేతన్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్థ్ కౌషల్, జిల్లా పరిషత్ సిఇఓ కైలాష్ గిరీశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి, వైద్య విధాన పరిషత్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఉషా, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఎం శేషిరెడ్డి, చంద్రలీల, సతీష్, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం శేషిరెడ్డి, డిఎస్పి నాగేశ్వర రెడ్డి, వైద్య అధికారులు,తహశీల్దారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.