తెలంగాణ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు
తెలంగాణ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు చేసినట్లు యస్ఇబి జిల్లా సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలి యస్ఇబి కార్యాలయంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యస్ఇబి సూపరింటెండెంట్ ఆవులయ్య మాట్లాడుతూ కొనకనమీట్ల మండలం చినమనగుండ్లం గ్రామంలో తెలంగాణ మద్యం ఉందని సమాచారం అందుకున్న పొదిలి యస్ఇబి సిఐ వెంకట్రావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి తెలంగాణాకు చెందిన 370 క్వార్టర్ బాటిల్స్ లను స్వాధీనం చేసుకొని చుంచు మాలకొండరాయుడు వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా తన గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుంచి సిమెంట్ లారీ లో తీసుకొని వచ్చినట్లు తెలియజేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ మద్యం పట్టివేత లో కీలకం వ్యవహరించిన సిఐ వెంకట్రావు మరియు సిబ్బందిని అభినందించారు.