మూడు దొంగతనాల కేసులో ఒకరి అరెస్టు త్వరితగతిన కేసు ను కేసును చేధించిన పొదిలి సిఐ,యస్ఐ , సిబ్బందికి రివార్డులు దర్శి డియస్పీ నారాయణస్వామి రెడ్డి వెల్లడి
మూడు దొంగతనాల కేసులో ఒక ముద్దాయి అరెస్టు చేసినట్లు దర్శి డిఎస్పి నారాయణ సోమిరెడ్డి తెలిపారు.
వివరాల్లోకెళ్తే ఆదివారంనాడు పొదిలి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో దర్శి డిఎస్పి నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ గత నెల 27వ తేదీ మల్లవరం గ్రామ సమీపంలో చిల్లర దుకాణంలో ఒక ఫ్రిజ్, గ్యాస్ సిలిండర్, పొయ్యి, పాలకేంద్ర సమీపంలో ఉన్న ఇనుమును, అదే రోజు రాత్రి ఉన్నగురవాయిపాలెం షణ్ముఖ వ్యవసాయ వెంచర్ నందు గడ్డి కటింగ్ చేసే యంత్రం, పురుగులు ముందు కొట్టే యంత్రం, ఇతర వస్తువులను దొంగలించారని వాటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు విలువ ఉంటుందని మొత్తం చొత్తును స్వాధీనం చేసుకొని నిందితుల్లో చిడితోటి మధు అరెస్టు చేసినట్లు మరియు త్వరితగతిన కేసు చేధించిన పొదిలి సిఐ సుధాకర్ రావు, యస్ఐ శ్రీహరి, పోలీసు సిబ్బంది కి అభినందిస్తూ వారికి త్వరలో రివార్డులను అందిస్తామని తెలిపారు.
ఈ విలేఖరుల సమావేశంలో పొదిలి సిఐ సుధాకర్ రావు యస్ఐ శ్రీహరి, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, కానిస్టేబుల్ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు