జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం బైటాయించిన : జంకె ఆదిములపు

ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పొదిలి పెద్దచెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లాగా మార్చే ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో ఆమోదం పొందినప్పటికీ, ఉన్నతస్థాయిలో పెండింగ్ పెట్టటం పట్ల నిరసన వ్యక్తం చేసి పొడియం వద మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి సంతనుతలపాడు శాసన సభ్యులు ఆదిములపు సురేష్ జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు,ఎంపీపీ నర్సింహారావు ఉడుముల రామనారయణరెడ్డి  బైటాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పొదిలిలో నీటి కష్టాలు మొదలు అయ్యాయని, ఈ ప్రాజెక్ట్ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తేనే ఉపయోగం లేకుంటే వలసలు తప్పవని హెచ్చరించారు. రాబోయే వేసవిలో మరొకమారు దుర్భిక్షం రానుందని, తగిన చర్యలు తీసుకోవాలని ముందుగానే తెలియచేస్తున్నాము అని జేసీ నాగలక్ష్మి మరియు జిల్లా అధికారులతో పేర్కొన్నారు వేసవి నీటి ఎద్దడికి, నీటి కష్టాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని లేకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదని స్టేజ్ దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ పొదిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి కేంద్ర మంత్రితో కూడా చర్చించాను అని, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని స్వయంగా కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి అని ఉన్నతాధికారులతో పేర్కొన్నారు. మీరు నోటిఫై చేయించండి మేము ఆమోదింపచేసుకుంటాము అని అధికారులకు తెలియచేసారు. మొత్తం మీదా సమావేశంలో పొదిలి నీటి సమస్య గురించి వేడి వేడి గా చర్చ జరిగింది