నూకసాని బాలాజీని కలిసిన యాదవ మహాసభ నాయకులు

ప్రకాశంజిల్లా మరియు పొదిలి మండల యాదవ మహాసభ నాయకులు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నుకసాని బాలాజీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


వివరాల్లోకి వెళితే ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూకసాని బాలాజీని నియమిస్తూ తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారంనాడు ప్రకటన విడుదల చేసిన సందర్భంగా బుధవారంనాడు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా మరియు పొదిలి మండల నాయకులు ఒంగోలు లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబురావు యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్, మందగిరి వెంకటేష్ యాదవ్, మండల నాయకులు పెమ్మని రాజు, రెడ్డిబోయిన సుబ్బారావు యాదవ్, బీసి నాయకులు మచ్చా రమణయ్య తదితరులు పాల్గొన్నారు.