రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కుందూరు
రక్తదానం శిబిరాన్ని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక విశ్వనాథపురంలోని వివేకానంద విద్యా సంస్థలలో వైసిపి నాయకులు కసిరెడ్డి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన కేకును నాగార్జునరెడ్డి కోసి అభిమానులకు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, వైసిపి నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, స్థానిక వైసిపి నాయకులు జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి,గుజ్జుల సంజీవరెడ్డి, సాయి రాజేశ్వరరావు, పులగొర్ల శ్రీనివాస్ యాదవ్, గొలమారి చెన్నారెడ్డి, ఉలవ గోపి, షేక్ మహబూబ్ బాషా, వర్షం ఫీరోజ్ మరియు వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.