దివ్యంగుల సేవా సమితి కార్యాలయం ప్రారంభం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
నవ్యాంధ్ర దివ్యంగుల సేవా సమితి కార్యాలయం ప్రారంభం కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం నాడు స్థానిక పియన్ఆర్ కాలనీ నందు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తిన నరసింహారావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పొదిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కొవేలకుంట నరసింహారావు లాంచనంగా ప్రారంభించారు.
అనంతరం కార్యాలయం లోని కంప్యూటర్ ను లాంచనంగా ప్రారంభించి దివ్యంగుల దివ్యాంగుల ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బత్తిన నరసింహారావు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు కంప్యూటర్ శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని ఈ అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చంద్రశేఖర్ మరియు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు