పొదిలి నగర పంచాయతీగా మారుస్తూ వెలువడిన ఉత్తర్వులు
ఎట్టకేలకు పొదిలి నగర పంచాయతీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వ రాజపత్రం విడుదలైంది.
పొదిలి, మాదాలవారి పాలెం, నందిపాలెం, కంభాలపాడు గ్రామ పంచాయతీలను కలుపుకుని పొదిలి నగర పంచాయతీ ఏర్పాటులో భాగంగా రేపోమాపో కమిషనర్ నియామకంతో నగర పంచాయతీ పాలన ప్రారంభం కానుంది.
ఎన్నో రోజులనుండి పొదిలి ప్రజలు ఎదురు చూస్తున్న పొదిలి నగర పంచాయతీ మార్పుతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.