ఓటియస్ అవగాహన సదస్సు

పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రజలు సంపూర్ణ అవగాహన కల్పించి వారి నుంచి గ్రామాల్లో 10 వేలు మున్సిపల్ లో 15 వేలు కార్పొరేషన్ ల్లో 20 వేలు వసూలు చేయాలని కోరారు

ఇప్పటి వరకు మన డివిజన్ పరిధిలో కోటి రూపాయలు పైగా లబ్దిదారులు నుంచి నగదు చెల్లించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు