7వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 7వ వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
ఏడో వార్డు నందు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఇంటి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు 2 వ సచివాలయ సిబ్బంది మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి , జి శ్రీనివాసులు, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ నూర్జహాన్, మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి మరియు పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి కార్యదర్శి కల్లం వెంకట సుబ్బారెడ్డి మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు