8వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 8వ వార్డు పుల్లరపేట, నవాబుమిట్ట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

8వ వార్డు నందు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఇంటి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు 2 వ సచివాలయ సిబ్బంది మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు  శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షులు హనిమూన్ శ్రీనువాసులరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ నూర్జహాన్ మరియు పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి కార్యదర్శి కల్లం వెంకట సుబ్బారెడ్డి మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.