నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో పతకాలు సాధించిన ఆక్స్ ఫర్డ్ విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2018లో పొదిలి ఆక్స్ ఫర్డ్ పాఠశాల 9వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. ఎల్లో బెల్ట్ కరాటేలో కట మరియు కుమితే విభాగంలో కె యశ్వంత్ అనే విద్యార్థి ప్రధమ స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు సాధించగా………వైట్ బెల్ట్ విభాగంలో షేక్ మాశుక్, పి మోహన్ కృష్ణ, సిహెచ్ లోకేష్ అను విద్యార్థులు రెండవ స్థానంలో నిలిచి వెండి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభను కనపరచిన విద్యార్థులను కరస్పాండెంట్ భాగ్యలక్ష్మి, డైరెక్టర్ అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ రామాంజనేయులు, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనపరచడానికి శిక్షణ ఇచ్చిన మాస్టర్ వేణు, మరియు సలహాలు సూచనలు అందించిన లీల మణికంఠ మరియు మధు లను పాఠశాల యాజమాన్యం సత్కరించినట్లు ఆక్స్ ఫర్డ్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.