పొదిలిటైమ్స్….. ఉత్తమ మహిళ అవార్డు గ్రహీత పద్మావతి

ఉత్తమ మహిళా అవార్డు గ్రహీతగా సామి వెంకట పద్మావతిని ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పద్మావతి తన సొంత నిధులతో ఒక ప్రార్ధన మందిరం నిర్మించారు. అదేవిధంగా ఎలాంటి ప్రచారం లేకుండా పలు కార్యక్రమాలకు ఆర్ధిక సహకారం అందిస్తూ తనలో ధాతృత్వాన్ని చాటుకుంటు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమెలోని దాన గుణాన్ని పరిగణనలోకి తీసుకుని పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ మహిళా అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.