పాదయాత్ర ప్రారంభించనున్న కందుల
అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి అనే నినాదంతో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి పాదయాత్ర తలపెట్టనున్నారు. శనివారంనాడు పొదిలి స్థానిక నవాబుమిట్ట నందు డీప్ బోరును ప్రారంభించిన కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ జనవరి 21వతేదీ సాయంత్రం నుండి అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి అనే నినాదంతో ప్రజలలోకి పాదయాత్రగా అభివృద్ధి కార్యక్రమాలు వివరించనున్నామని ఈ పాదయాత్ర మార్కాపురం, తర్లుపాడు మీదుగా ఫిబ్రవరి 4వతేదీన పొదిలి భారీ ముగింపు సభతో పాదయాత్ర ముగిస్తామని తెలిపారు.