భారత జవాన్లపై దాడిని నిరసిస్తూ భారీ ర్యాలీ….. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ దిష్టిబొమ్మ దహనం
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో అసువులు బాసిన జవాన్లకు సంఘీభావంగా భారీ ర్యాలీ మానవహారం నిర్వహించి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
వివరాల్లోకి వెళితే శనివారం ఉదయం శ్రీ మహర్షీ విద్యా సంస్థ విద్యార్థులు చిన్నబస్టాండ్ నుండి పెద్ద బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించి పెద్దబస్టాండ్ సెంటర్ నందు మానవహారం మరియు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఖబడ్దార్…. పాకిస్థాన్ ముర్ధాబాద్ అంటూ… వందేమాతరం… భారత మాతాకి జై…
హిందుస్థాన్ మేరి జాన్…. భారతదేశం మాప్రాణం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీ కొనసాగించారు.ఈ కార్యక్రమంలో మహార్షీ విద్యాసంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయలు, తదితరులు పాల్గొన్నారు.