పల్స్ పోలియో అవగాహన ర్యాలీ

పొదిలి ప్రభుత్వ వైద్య శాల నుండి పట్టణ ప్రధాన విదులు గుండా పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. పొదిలి ప్రభుత్వ వైద్య అధికారి చక్రవర్తి పచ్చజెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రచారం చేశారు. ఈ నెల 28 తేది మరియు మార్చి 11వ తేది రెండు రోజుల పాటు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. పోలియో చుక్కల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసామని ప్రభుత్వ వైద్య శాఖ చెందిన శ్రీనివాసులు రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య శాఖ చెందిన సిబ్బంది శ్రీనివాసులు రెడ్డి ప్రభుత్వ వైద్య సిబ్బంది మరియు అంగనవాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు