దర్శి నగర పంచాయతీ ఎన్నికలపై పాంచజన్యం సర్వే
ప్రకాశంజిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికలపై పాంచజన్యం సర్వే సంస్థ సర్వే బృందం వార్డుకు 120శాంపిల్స్ సేకరణతో సర్వే నిర్వహించింది.
దర్శి నగర పంచాయతీ నందు మొత్తం 20వార్డుల్లో 1వార్డు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఏకగ్రీవం కాగా మిగిలిన 19వార్డులలో ఎన్నికలు జరుగుతుండగా……
ఏకగ్రీవంతో కలుపుకుని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ 8వార్డులు మరియు తెలుగుదేశం పార్టీ 5వార్డులలో విజయం సాధించించే అవకాశం ఉందని……
ఏడు వార్డులలో 6వార్డులలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలకు మధ్య పోటాపోటీగా ఉన్నట్లు….
మిగిలిన 1వార్డులో వైయస్ఆర్ కాంగ్రెసు, తెలుగుదేశం మరియు జనసేన మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చునని అంచనా వేసింది.
ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉండగా ఓటర్ల ప్రలోభాలు, పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఫలితాలు మారే అవకాశం కూడా ఉన్నట్లు పాంచజన్యం సర్వే బృందం అంచనా వేసింది.