మూడో రోజుకు పంచాయతీ కార్మికుల సమ్మె…. ఎడతెరిపి లేని వర్షంలో కూడా ధర్నా
సోమవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమ్మెలో భాగంగా 3వరోజు పొదిలి పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి కుంబవర్షంలోనూ గొడుగులతో పంచాయతీ ఆఫీసు నుండి పెద్దబస్టాండ్ వరకు ప్రదర్శనచేసి అనంతరం పంచాయతీ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈధర్నా ప్రదర్శనను ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ పంచాయతీ కాంట్రాక్టు కార్మికుల పియఫ్ కు పంచాయతీ వాటాగా చెల్లించాల్సిన 9లక్షల రూపాయలు చెల్లించకపోడంతో బెన్ఫిట్స్ కార్మికులకు అందడం లేదని…… ఈమధ్యకాలంలో 6గురు కార్మికులు మరణించినా పంచాయతీ నిర్వాకంతో కార్మిక కుటుంబాలకు పెన్షన్ రాకపోగా భార్యాపిల్లలు ఎలాంటి సహాయానికి నోచుకోలేదని….. కార్మికులకు జరిగిన నష్టానికి పంచాయతీ అదికారులే భాధ్యత వహించాలన్నారు.
గత పది సంవత్సరాలుగా టెండర్ డిపాజిట్ డబ్బులు కార్మికులకు చెల్లించలేదని…. టెండర్ గడువు ముగిసి నాలుగునెలలు గడుస్తున్నా నేటికీ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచలేదని…. టెండర్ లేకుండా పాతకాంట్రాక్ట్ కార్మికులను కొనసాగించాలన్న హైకోర్ట్ తీర్పు మేరకు జిల్లా పంచాయతీ అధికారి జీఓ ఇచ్చినప్పటీకి పొదిలిలో అమలుచేయటంలేదన్నారు.
వర్షాలతో అంటువ్యాదులు ప్రబలుతున్నందున చెత్త చెదారం సైడ్ కాలువలుతీసే పంచాయతీ కార్మికులకులందరికి హ్యండ్ గ్లౌజులు మౌత్ మాస్క్ లు సరఫరాచేసి అనారోగ్యం పాలుకాకుండా చూడాలని అన్నారు. జీఓ నంబర్ 142 ,138 ని అమలుచేయాలని పొదిలిలో పంచాయతీ కార్మికులందరికి బట్టలు సబ్బులు, నూనె, చెప్పులు, టవల్స్ ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్&హెల్పర్స్ యూనియన్ జిల్లాఅధ్యక్షులు జి నాగులు, పంచాయతీ కార్మికులు కెవి నరసింహం, జి సుబ్బయ్య, పోలా సుబ్బులు, నాగేంద్రం, జి ఏసోబు తదితరులు పాల్గొన్నారు.